వందేమాతరం ఆకారంలో విద్యార్థుల ప్రదర్శన
బాసర, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని హంస వాహిణి ప్రైవేట్ పాఠశాల (Hansa Vahini Private School) లో శుక్రవారం వందేమాతరం గీతం రచించి ఒక 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు వినూత్నంగా తమ ప్రదర్శన ఇచ్చారు. పాఠశాల ప్రాంగణంలో వందేమాతరం ఆకారంతో పాటు 150వ ఆకారంలో ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది.
అంతకుముందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు వందేమాతరం గీతాలాపన నిర్వహించారు. స్వాతంత్రోద్యమ సంగ్రామంలో వందేమాతరం గీత విశిష్టత గూర్చి వివరించారు.

