HYD | ఫెర్టిలిటీ చికిత్సలో ప్రఖ్యాతి గాంచిన గ్లోబల్ హబ్
హైదరాబాద్ : ఇప్పటికే లైఫ్ సైన్సెస్ హబ్ గా పేరొందిన హైదరాబాద్ ఫెర్టిలిటీ చికిత్సలో కూడా ఒక ప్రత్యేక గమ్యస్థానంగా శరవేగంగా గుర్తింపు పొందుతోందని ఒయాసిస్ ఫెర్టిలిటీ సైంటిఫిక్ హెడ్ అండ్ క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డా. కృష్ణ చైతన్య మంత్రవాది అన్నారు. ఆయన మాట్లాడుతూ… అత్యాధునిక వైద్య సదుపాయాలు, అత్యంత నైపుణ్యం కలిగిన స్పెషలిస్ట్ లతో, ఫెర్టిలిటీ ఆరోగ్య సంరక్షణలో ఈ సిటి మంచి అభివృద్ధిని చూస్తోందన్నారు. సిటీ అంతటా ఫెర్టిలిటీ సెంటర్లు వేగంగా పెరుగుతుండడంతో అపోహలకు ఫుల్ స్టాప్ పడుతుందన్నారు. పిల్లలు కనడంలో లోపం ఉన్నవారిలో సమస్యలను పరిష్కరిస్తుంది. సమగ్ర, ప్రత్యేక, సరసమైన చికిత్సల ద్వారా జంటలకు కొత్త ఆశను అందిస్తున్నారన్నారు. అందుబాటులో ఉన్న వివిధ ఫెర్టిలిటీ చికిత్సలలో, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవిఎఫ్ ) గర్భం పొందడానికి కష్టపడుతున్న జంటలకు ఆశాదీపంగా నిలుస్తుందన్నారు.
హైదరాబాద్ లోని టాప్ ఫెర్టిలిటీ సెంటర్లు అధునాతన ఐవీఎఫ్ టెక్నిక్స్ లో ప్రత్యేకత కలిగి ఉన్నాయన్నారు. పిల్లలు లేకుండా బాధపడుతున్న వారికి జీవితంలో ఆశకిరణాన్ని అందిస్తున్నాయన్నారు. ఐవిఎఫ్ ఖర్చు అనేది చాలా మందికి ఒక పెద్ద ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, నాణ్యత లేదా సైంటిఫిక్ పురోగతిలో రాజీపడకుండా స్థోమత ప్రకారం ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా హైదరాబాద్ ఫెర్టిలిటీ- సంరక్షణను మరింత అందుబాటులోకి తెచ్చింది. ఐవిఎఫ్ మాత్రమే కాకుండా లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ (ఎల్‌ఏహెచ్), ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనాలిసిస్ (ఈఆర్‌ఏ), మైక్రోస్కోపిక్ టెస్టిక్యులర్ స్పెర్మ్ ఎక్సాక్ష్రన్ (మైక్రో టీఈఎస్‌ఈ ) వంటి అత్యాధునిక సంతానోత్పత్తి చికిత్సలను అందించడంలో హైదరాబాద్ ముందంజలో ఉందన్నారు.
ఈ అధునాతన ఫెర్టిలిటీ పద్ధతులను కలిపి, నగరంలోని ఫెర్టిలిటీ- సెంటర్లు పునరుత్పత్తి సంరక్షణ స్వరూపాన్ని మారుస్తున్నాయి. జంటలు తమ మాతృత్వ కలలను నెరవేర్చడంలో సహాయపడుతున్నాయన్నారు. సంతానోత్పత్తి చికిత్సలో హైదరాబాద్ అగ్రగామిగా నిలుస్తుండటంతో, పిల్లలు కనడంలో లోపం ఉన్నవారికి కష్టం తగ్గించే విధంగా మరింత ఆశాజనకంగా మారుతోందన్నారు.