శ్రీ పడమటి అంజన్నకు ప్రత్యేక పూజలు..
మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట మక్తల్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో బజరంగ్ దళ్(Bajrang Dal) తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్ కన్న బోయన వెంకట్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. తెలంగాణ జిల్లాల పర్యటనలో భాగంగా ఈ రోజు మక్తల్ పట్టణానికి వచ్చిన ఆయనకు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ప్రఖండ(Bajrang Dal is huge) ఘనంగా స్వాగతం పలకారు.
స్థానికంగా ఎంతో ప్రశస్తం కలిగిన శ్రీ పడమటి అంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అరవింద చారి(Aravinda Chari) సేవతో ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందజేశారు. ఆలయ విశిష్టతను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షుడు కే. సత్యనారాయణ గౌడ్, బజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక్ భీమేష్, ప్రఖండ సంయోజక్ రాహుల్, సహా సంయోజక్ శివ, మండల సహా సంయోజక్ శంకర్, గోరక్ష సంయోజక్ అనిల్, శ్రీను, పరశు రామ్, శంకర్, బజరంగ్ దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

