ఆ ఇద్దరు విద్యార్థులకు అభినందనలు..

ఆ ఇద్దరు విద్యార్థులకు అభినందనలు..

ఉట్నూర్, (ఆంధ్రప్రభ)
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల కళాశాల చదువుతున్న ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థినీలు జాతీయస్థాయి అథ్లెటిక్ క్రీడల పోటీలకు ఎంపికైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని జింఖాన స్టేడియంలో ఈనెల 5న బుధవారం జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో తమ పాఠశాల చెందిన ఎంపీసీ గ్రూపు విద్యార్థిని మరప లావణ్య, బైపీసీ ద్వితీయ సంవత్సర విద్యార్థిని రాథోడ్ నీరజ పాల్గొని పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఈనెల 26 నుంచి 30 వరకు హర్యానాలో జరిగే జాతీయ అథ్లెటిక్ క్రీడా పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపాల్ తెలిపారు. హైదరాబాదులో జరిగిన పోటీల్లో 2, 3 స్థానాలు సాధించి జాతీయస్థాయి క్రీడలకు ఎంపీలు కావడం పట్ల ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు… ఎంపికైన విద్యార్థినీలను అభినందించారు.

Leave a Reply