డ్రంక్ అండ్ డ్రైవ్ లో జైలు శిక్ష..

డ్రంక్ అండ్ డ్రైవ్ లో జైలు శిక్ష..
బిక్కనూర్, (ఆంధ్రప్రభ)
డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి జైలు శిక్ష విధించడం జరిగిందని కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన ముత్యపు ఆంజనేయులు మద్యం సేవించి వాహనం నడిపినట్లు చెప్పారు. ఆయన పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం జరిగిందన్నారు. మెజిస్ట్రేట్ ఆయనకు ఒక రోజు జైలు శిక్షతో పాటు 1000 రూపాయలు జరిమానా విధించినట్లు చెప్పారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ.. మద్యం సేవించి ఎవరు వాహనాలు నడిపిన కేసును నమోదు చేయడం జరుగుతుందన్నారు.
