నమో నారసింహ

నమో నారసింహ
శ్రీ లక్మీ నృసింహుని దర్శించుకున్న కవిత
నిజామాబాద్, భీంగల్ టౌన్, నవంబర్ ( ఆంధ్రప్రభ ): నిజామాబాద్ జిల్లా (Nizamabad District) భీంగల్ మండలం నింబాచల క్షేత్రంపై స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్బంగా బుధవారం శ్రీ లక్మీ నృసింహుని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) దర్శించుకున్నారు.

కార్తీక పౌర్ణమి సందర్బంగా క్షేత్రానికి ఉదయం చేరుకున్న కవిత గర్భాలయంలోని శ్రీ లక్మీ నృసింహులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు కవిత కు స్వాగతం పలికారు. స్వామి కి ప్రత్యేక పూజలు జరిపి స్వామి అంక్షింతలు, తీర్థ, ప్రసాదం అందజేశారు. ఆలయ విశిష్టత వివరించారు.
