కర్టాటకలో రోడ్డు ప్రమాదం..

కర్టాటకలో రోడ్డు ప్రమాదం..
దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం
స్పాట్ లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు
కర్ణాటకలో జరిగిన ప్రమాదంలో నలుగురు తెలంగాణవాసుల మృతి..
ఉమ్మడి మెదక్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ): దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్పాట్ లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హల్లిఖేడ్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాను, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్ పూర్ గ్రామానికి చెందిన నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (40)గా గుర్తించారు. కాగా మరొకరు తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. ఘనగాపుర్ దత్తాత్రేయ ఆలయం దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం చేసుకున్నట్టు తెలిసింది. కాగా కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అవడంతో ప్రమాద తీవ్రత అర్ధమవుతుంది.
