కార్యదర్శి మందలించాడని..
పంచాయతీ స్వీపర్ ఆత్మహత్యాయత్నం
ములుగు, (ఆంధ్రప్రభ ప్రతినిధి) : ములుగు జిల్లా గోవిందరావు పేట మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీలో స్వీపర్ గా పని చేస్తున్న వెంకన్న (58) , పంచాయతీ కార్యదర్శి మందలించాడానే నెపంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.అతడిని ములుగు లోని జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లుగా గ్రామంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

