డిజిటల్ తెలంగాణలో మీసేవ పాత్ర కీలకం
ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి : డిజిటల్ తెలంగాణలో మీసేవ పాత్ర కీలకం అని ఈ – డిస్ట్రిక్ట్(This – District) మేనేజర్ దేవేందర్ అన్నారు. ఈ మేరకు ఈ రోజు తెలంగాణ మీసేవ అవతరణ దినోత్సవ సందర్భంగా ములుగు జిల్లా ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ సామాజి దేవేందర్(Samaji Devender) మాట్లాడుతూ.. 14 సంవత్సరాల నుండి మీసేవ ద్వారా దాదాపు 32 డిపార్ట్మెంట్ల నుండి 400లకు పైగా సర్వీసులను డిజిటల్ రూపంలో అందిస్తున్నామనీ అన్నారు.
నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగుతూ మరింత స్మార్ట్ , డిజిటల్ తెలంగాణను(Smart, Digital Telangana) నిర్మించడానికి మా వంతు మీసేవ తరుపున ఎల్లప్పుడూ కృషి చేస్తామని అన్నారు.

