ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం

ప్యాసింజర్-గూడ్స్ రైళ్లు ఢీ..
ఆరుగురు మృతి, 25 మందికి గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం హావ్రా రూట్‌లో ఘోర‌ రైలు ప్రమాదం సంభవించింది. లాల్‌ఖదన్ సమీపంలో ఒక ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 6 మంది మరణించినట్లు, మరో 25 మందికి గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రైల్వే అధికారుల నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఢీకొన్న ప్రభావంతో ప్యాసింజర్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే రైల్వే, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బిలాస్‌పూర్-కట్ని సెక్షన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ మార్గం చాలా రద్దీగా ఉండే మార్గం కావ‌డంతో.. రైలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఓవర్‌హెడ్ వైర్లు, సిగ్నల్ వ్యవస్థలకు కూడా డ్యామేజ్ అయిన‌ట్టు తెలుస్తోంది. దీంతో రాకపోకల పునరుద్ధరణకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్ని రూట్లను మళ్లించారు. రైల్వే శాఖ అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రయాణికులు తాజా సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Leave a Reply