ఎస్టీయూతోనే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం

ఎస్టీయూతోనే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం

ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బి.రవి


తొర్రూరు, నవంబర్4 ఆంధ్రప్రభ : టీచర్ల సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ టీఎస్ అలుపెరుగని పోరాటాలు చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భీమనాధుడి రవి (Bhimanathudi Ravi) తెలిపారు. మంగళవారం తొర్రూరు హైస్కూల్ లో ఎస్టీయూ టీఎస్ మహబూబాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా నాగరాజు, పరిశీలకుడిగా సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా నూతన అధ్యక్షుడిగా గన్నోజు ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కొరవి సుధాకరా చారి, ఆర్థిక కార్యదర్శిగా రమేష్, అసోసియేట్ అధ్యక్షుడిగా యాకుబ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ యాకయ్య, శ్రీరాములు, కార్యదర్శిగా సంపత్ కుమార్, మహిళా ఉపాధ్యక్షురాలుగా శకుంతల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.

అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు రవి మాట్లాడుతూ… విద్యారంగ సమస్యలు (Educational problems), ఉపాధ్యాయల పెండింగ్ సమస్యలైనా సిపిఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, సర్వీస్ రూల్స్ సాధన, నగదు రహిత వైద్య సేవలు, మోడల్ స్కూల్ టీచర్ల సర్వీస్ అంశాలు, మెడికల్ రియంబర్స్మెంట్ మరియు జీరో వన్ జీరో సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ టీఎస్ కృషి చేస్తుందని తెలిపారు. రిటైర్మెంట్ అయిన ఉపాధ్యాయుల జిపిఎఫ్, టి ఎస్ జి ఎల్ ఐ సమస్యలను పరిష్కరించాలని, పిఆర్సి రిపోర్టును తెప్పించుకొని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఉపాద్యాయులు పాఠశాలల సంరక్షనకి అంకితమై సమరశీల ఉద్యమాలకు సిద్ధంగా వుండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ ఏళ్ల మధుసూదన్, సతీష్ కుమార్, చంద్రమౌళి, జి శ్రీనివాస్, హరికృష్ణ చారి, వెంకన్న, ఏకాంబర చారి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply