3 ఆవులు మృతి. ఏం జరిగింది..?
వెల్దండ, ( ఆంధ్రప్రభ )
వెల్దండ మండల సమీపంలోని తిమ్మనోనీ పల్లి గ్రామానికి చెందిన గుమ్మకొండ లింగమయ్యకి సంబందించిన మూడు పాడి ఆవులు మృతి చెందినట్లు తెలియజేశారు. రైతు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం సాయంత్రం పాలు పిండుకొని ఆవుల షెడ్డులో ఆవులని కట్టి ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం పాలు పిండడానికి వెళ్లే సరికి మూడు ఆవులు విగత జీవిగా పడి ఉండడాని చూసి బోరున విలపిస్తూన్నాడు. సోమవారం కురిసిన భారీ వర్షం కారణంగా పిడుగుపాటుతో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఆవులపై ఆధారపడి కుటుంబ జీవనం కొనసాగించే వారమని.. ఒకేసారి 3ఆవులు మరణించడంతో కుటుంబ పరిస్థితి ఇబ్బందిగా మారిందని రైతు లింగమయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఆవుల విలువ 2 లక్షల15 వేల ఉంటుందని తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని వారు కోరారు.

