సత్యసాయి జిల్లాలో బస్సు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయిజిల్లాలో చెన్నే కొత్తపల్లి మండల పరిధిలో దామాజిపల్లి వద్ద జబ్బర్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. ఐచర్ వాహనాన్ని ఢీ కొట్టిన జబ్బర్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు బోల్తాపడింది. ఈ బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా 8 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. అర్థరాత్రి 2 గంటలకు ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయాలు అయిన వారిని ఆస్పత్రికి తరలించారు.

