జాతీయ రహదారిపై కారు ప్రమాదం..

జాతీయ రహదారిపై కారు ప్రమాదం..

బాధితులకు ఆసరాగా నిలిచిన ఎమ్మెల్యే కోట్ల


కర్నూలు బ్యూరో, నవంబర్ 3, ఆంధ్రప్రభ : మానవత్వానికి నిదర్శనంగా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి (Kotla Suryaprakash Reddy) నిలిచారు. కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారిపై జిఆర్సీ ఫంక్షన్ హాల్ సమీపంలో సోమవారం ఓ కారు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సమయంలో అటుగా ప్రయాణిస్తున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఈ ఘటనను గమనించి వెంటనే స్పందించి, గాయపడిన వారిని స్వయంగా సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అక్కడి వైద్యులను ఎమ్మెల్యే కోరారు.

ఈ ప్రమాదం బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారుకు జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో పాల్గొన్న వారంతా ప్రస్తుతం ఆరోగ్యపరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply