అధికారుల పర్యవేక్షణ కరువైందా..?

అధికారుల పర్యవేక్షణ కరువైందా..?

మోత్కూర్, (ఆంధ్రప్రభ)
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం సదర్శాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని కొమ్మూరి బావికి వెళ్లే మట్టి రోడ్డు ఇబ్బందిగా ఉండడంతో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి సి డి పి (నియోజకవర్గ అభివృద్ధి పథకం) నిధుల కింద రూ.4 లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులకు 2024 మార్చి 10 న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. సాక్షాత్తు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి 20 నెలలు గడుస్తున్నా.. పనులు ప్రారంభం కాకపోవడంతో స్థానిక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు కొమ్మూరి బావి ప్రజలు, మహిళలు కనీసం నడవడానికి సైతం ఇబ్బందులు పడుతున్నారు. మరి ఎవరికైనా ఆపద వస్తే.. ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఈ రోడ్డు పనులు కాంట్రాక్టర్ ఎందుకు చేపట్టడం లేదో.. పంచాయతీ రాజ్ అధికారులకే తెలియాలి. అధికారుల పర్యవేక్షణ కరువై పనులు నిలిచాయా..? కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనా..? అని అర్ధం కావడం లేదు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపి తమ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply