మొత్తం 2,600 కోట్ల రూపాయల పంపిణీ
ఏలూరు ఆంధ్ర ప్రభ బ్యూరో: జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు ఏలూరు జిల్లా వేలేరుపాడులో పర్యటించారు. మంత్రి నిమ్మల చేతులమీదుగా పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు భూసేకరణ మరియు పునరావాస పరిహారం చెక్కుల పంపిణీ చేశారు. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నిర్వాసితులకు రెండో సారి అందుతున్న పరిహారం. గతంలో 2016లో పునరావాసం కింద నిర్వాసితులకు రూ.700 కోట్లు పంపిణీ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం.
ఇప్పుడు 2025 జనవరిలో మరోసారి రూ.900 కోట్ల పరిహారం పంపిణీ చేయగా తిరిగి శనివారం మరో రూ.1000 కోట్ల పంపిణీ చేసింది కూటమి ప్రభుత్వం. ఈ పంపిణీ కార్యక్రమంలో జలనరులశాఖా మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కొలుసు పార్థసారథి కూడా పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటే సమాంతరంగా నిర్వాసితులకు సమప్రాధాన్యత ఇస్తూ పునరావాస పనులు పూర్తి చేస్తుంది కూటమి ప్రభుత్వం.

