మోతెలో జాతీయ ఐక్యత దినోత్సవం
మోతె, ఆంధ్రప్రభ : జాతీయ సమైక్యత దినోత్సవం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మోతె మండల కేంద్రంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల వారోత్సవాలు, జాతీయ ఐక్యత దినోత్సవం ముగింపు సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.
ఎస్సై అజయ్ కుమార్ మాట్లాడుతూ… ఈ కార్యక్రమంలో ప్రజలు, యువత పాల్గొన్నారన్నారు. యువత దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణలో ముందుండాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి మహనీయుల ఆశయాలను అనుసరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు,యువత,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

