దృఢ సంకల్పం వలనే సాధ్యమైంది..

దృఢ సంకల్పం వలనే సాధ్యమైంది..

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : భారత మాజీ ఉప ప్రధాని, దేశ సమైక్యతా శిల్పి, ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్‌ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ఫతే మైదాన్, బషీర్ బాగ్ వద్దనున్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి ప్రారంభమై, అసెంబ్లీ సమీపంలోని పబ్లిక్ గార్డెన్ X రోడ్ వద్ద సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు, మహారాష్ట్ర ఐటీ మరియు సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆశిష్ షెలార్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్, బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు, తదితర నాయకులు పాల్గొన్నారు.

సర్ధార్ పటేల్ సేవలు, త్యాగాలు, దేశ సమైక్యత పట్ల ఆ మహనీయుడు చూపిన దృఢ సంకల్పాన్ని స్మరించుకుంటూ “ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్” సందేశంతో ఈ రన్ ఫర్ యూనిటీ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ.. భారత ఏకత్వానికి ప్రతీక, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతిని పురస్కరించుకొని వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఆ మహనీయడి స్ఫూర్తిని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఐక్యత, దేశభక్తి, సేవా భావాలను యువతలో నాటేందుకు ఈ కార్యక్రమం ఒక ప్రేరణగా నిలుస్తోంది.


సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్య సమరయోధుడు స్వాతంత్రం వచ్చిన తరువాత, భారతదేశపు మొదటి హోంశాఖ మంత్రిగా పని చేశారు. ఆయన కృషితోనే ఈ దేశంలోని చిన్న చిన్న సంస్థానాలను కలిపి, దాదాపు 560 సంస్థానాలను సమైక్యపరచి, ఈరోజు మనం గర్వంగా చెప్పుకునే అఖండ భారతాన్ని నిర్మించారు అన్నారు.

నాటి హైదరాబాద్ రాష్ట్రం, ఈరోజు తెలంగాణ.. భారతదేశంలో భాగమైందంటే అది కూడా సర్దార్ పటేల్ దృఢ సంకల్పం, ధైర్య నిర్ణయాల ఫలితంమే అని చెప్పారు. నిరంకుశ నిజాం పాలనకు ముగింపు పలికేందుకు ‘పోలీస్ యాక్షన్’ తర్వాత హైదరాబాద్ భారతదేశంలో కలిసింది. సర్దాల్ వల్లభాయ్ పటేల్ జీవితం, సేవలు ప్రతి యువతకు ప్రేరణ. ఆయన లాంటి ఉక్కు సంకల్పం, నిర్ణయశక్తి మనందరికీ మార్గదర్శకం కావాలి. అలాంటి స్ఫూర్తినే ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా కొనసాగిస్తున్నారు. సర్దార్ పటేల్ లా దేశ అఖండతను కాపాడుతూ, ఉగ్రవాదం, జిహాది ఉగ్రవాదులు, తీవ్రవాద సంస్థల పై దృఢంగా చర్యలు తీసుకుంటున్నారు. దేశాన్ని శాంతి, భద్రత, అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు.

ఈ స్ఫూర్తికి ప్రతీకగా గుజరాత్ రాష్ట్రంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం “స్టాచ్యూ ఆఫ్ యూనిటీ”ని నిర్మించడం జరిగింది. అది సర్దార్ పటేల్ స్ఫూర్తిని తరతరాలకు అందిస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, భారతీయ జనతా పార్టీ తరఫున సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను అన్నారు.

Leave a Reply