మోత్కూర్‌లో కూలిన పెంకుటిల్లు

మోత్కూర్‌లో కూలిన పెంకుటిల్లు

మోత్కూర్, అక్టోబర్ 30 (ఆంధ్రప్రభ) : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో బుధవారం కురిసిన భారీ వర్షం, మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో మున్సిపల్ కార్యాలయం సమీపంలో నిరుపేదకు చెందిన ఓ పెంకుటిల్లు పూర్తిగా నేలమట్టమైంది. మోత్కూర్ మల్లికార్జున చారికి చెందిన పెంకుటిల్లు గురువారం తెల్లవారుజామున కురిసిన వాన‌కు కూలింది. మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ కూలిన ఇంటిని పరిశీలించిన అనంతరం బాధితునికి నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రజలు శిథిలావస్థలో ఉన్న ఇళ్ల‌లో ఉండొద్ద‌ని సూచించారు.

Leave a Reply