అత్యధికం.. అత్యల్పం ఎంత..?
నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : మొంథా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా(Nellore District) వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం నాటికే జిల్లాలో సరాసరి వర్షపాతం 39 మిమీలుగా నమోదు అయ్యింది.
అత్యధికం(highest)గా దగదర్తి మండలంలో 69.8 మిమీలు, కొడవలూరులో 65.4, విడవలూరులో 64.6, కావలిలో 63.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా రాపూరు మండలంలో 14.2 మిల్లీమీటర్ల వర్షపాతం(mm rainfall) నమోదు అయ్యింది. తుఫాను ప్రభావంతో జిల్లాలోని 38 మండలాల్లో జోరుగా వానలు కురుస్తుండడం గమనార్హం.

