న‌ల్ల‌గొండ పోక్సో కోర్టు తీర్పు

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : బాలిక‌పై లైంగిక‌దాడికి య‌త్నించిన దోషి గొర్ల సైదులు అనే వ్య‌క్తికి ప‌దేళ్లు జైలు శిక్ష విధిస్తూ న‌ల్ల‌గొండ పోక్సో కోర్టు (Nalgonda POCSOCourt ) న్యాయ స్థానం తీర్పు చెప్పింది. జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా.. రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయ‌మూర్తి ఆదేశించారు.

తిప్పర్తి మండ‌లం కేశరాజుపల్లి గ్రామానికి చెందిన గొర్ల సైదులు త‌న ఆటోలో మైనర్ బాలికను ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో పరారీ అయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో 2019 లో తిప్పర్తి పీఎస్ లో నిందితుడు గొర్ల సైదులు పై పోక్సో కేసు నమోదైంది. పూర్తి సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం సైదుల‌ను దోషిగా నిర్ణ‌యించి శిక్ష వేస్తూ పోక్సో న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది.

Leave a Reply