ఎస్ఐఆర్ యాప్ నమోదుపై అవగాహన..

ఎస్ఐఆర్ యాప్ నమోదుపై అవగాహన..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి బీఎల్ ఓఎస్ఐఆర్(BL OSIR) ఎలక్ట్రోల్ మ్యాఫింగ్ యాప్ పకడ్బందీగా చేపట్టాలని ఊట్కూర్ ఇన్చార్జి తాహాసిల్దార్ కాళప్ప, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్ర రెడ్డి సూచించారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ తాహసిల్దార్ కార్యాలయంలో బిఎల్వోలకు ఎస్ఐఆర్ యాప్ నమోదుపై అవగాహన నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఎల్ఓలు గతంలో 2002 ఓటర్ జాబితా ఆధారంగా 2025 కొత్తగా నమోదైన ఓటర్లను ఒకే కుటుంబంలో జ‌త చేయాలని అన్నారు. బీఎల్వోలు బాధ్యతాయుతంగా ఎస్ ఐ ర్ యాప్ పూర్తి చేయాలన్నారు. ఓటర్ల జాబితాలో నిబంధన ప్రకారం పగడ్బందీగా నమోదు చేయాలన్నారు. ఎలక్ట్రోల్ మ్యాఫింగ్(Electrol Mapping) ఆన్లైన్ నమోదులో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కృష్ణారెడ్డి(RI Krishna Reddy) ఆయా గ్రామాల బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply