కరప్షన్‌కు కిరాక్ అడ్రస్ బీఆర్ఎస్

కరప్షన్‌కు కిరాక్ అడ్రస్ బీఆర్ఎస్

  • ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పాలన చేశారు
  • నియోజకవర్గ మండల కాంగ్రెస్ అధ్యక్షులు

ధర్మపురి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పాలన పారదర్శకంగా సాగుతుందని ధర్మపురి, బుగ్గారం, గొల్లపల్లి, వెల్గటూర్ మండల అధ్యక్షుడు సంఘనబట్ల దినేష్(Dinesh by association), వేముల సుభాష్, నిశాంత్ రెడ్డి, శైలేందర్ రెడ్డిలు అన్నారు ఆదివారం ధర్మపురి పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఇటీవల బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ ను ఉద్దేశించి దండుపాళ్యం సినిమాతో పోలుస్తూ మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖందించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman Kumar) ఎటువంటి చర్చకు అయిన సిద్ధమని మీడియా ముఖంగా సవాల్ విసిరారని, దానిలో భాగంగా సిద్దిపేటకు మంత్రి అడ్లూరి వెళ్లి వెంకటేశ్వర స్వామి వారినీ దర్శించుకొని మీడియాతో మాట్లాడిన అనంతరం అక్కడికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వచ్చి ప్రభుత్వం పైన తీవ్రమైన అవాస్తవ వ్యాఖ్యలను చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏటువంటి ఆర్థిక క్రమశిక్షణ లేకుండ పాలన చేసారని అది అందరికి తెలుసునని, కరప్షన్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న బిఆర్ఎస్(BRS) నాయకులు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగిందో రాష్ట్ర ప్రజలకు తెలుసునని,వారి హయాంలో జరిగిన ఏ సంక్షేమ పథకాల అమలులో అయిన అందులో అవినీతే ఉంటుందని, మాజీ మంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) గురించి మా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడితే వారి భజనపరులైన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కిషోర్ లు ఇష్టానుసారంగా మంత్రి అడ్లూరి గురించి మాట్లాడుతున్నారని, ఒక్క సారి ఆ ఎమ్మెల్యేలు వారి స్థాయిని మించి మాట్లాడుతున్నాడన్న విషయం ర్తుంచుకోవాలన్నారు.

మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ అతను చేసిన ఇసుక దంద గురించి ప్రజలు తెలుసునని,కొప్పుల ఈశ్వర్ అధికారంలో ఉన్నప్పుడు ధర్మపురికి ఏమి అభివృద్ధి చేశాడో చెప్పాలని, చందాల పైన ఉద్యమాన్ని నడిపిన రసమయి బాలకిషన్ ఇప్పుడు ఇన్ని కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని, అధికారం కోల్పోయిన బాధలో కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) ఏం మాట్లాడుతున్నాడో వారికే అర్థం కావడం లేదని,మీ ప్రభుత్వ హయాంలో త్రాగడానికి నీళ్ళు లేక బిందెలతో మహిళలు రోడ్లపైకి రావడం జరిగిందనీ, మా ప్రభుత్వంలో అలాంటి సంఘటనలు జరిగాయా అని, మీ ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీలు, నోటిఫికేషన్లు సరిగా ఇవ్వక నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని, మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పటి వరకు సుమారు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందని పేర్కొన్నారు.

ఇదే విధంగా అవాస్తవ ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జక్కు రవీందర్(Jakku Ravinder), మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల రాజేష్, నాయకులు చిలుముల లక్ష్మణ్, సింహరాజు ప్రసాద్, రామ్ దేని మొగిలి, ఒజ్జల లక్ష్మణ్, బాలగౌడ్, రాజా గౌడ్ రాపర్తి సాయి, దాసరి పురుషోత్తం, బొల్లారపు పోచయ్య నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply