సత్వ ప్రకృతి వైద్య ఆసుపత్రి ప్రారంభం..

సత్వ ప్రకృతి వైద్య ఆసుపత్రి ప్రారంభం..

చెన్నూర్ , ఆంధ్రప్రభ : నేటి సమాజం ఆరోగ్యారీత్యా ఎలాంటి వ్యాధులకైనా ప్రకృతి వైద్యాన్ని అలవార్చుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్టులు(Side effects) ఉండవని పెద్దపెల్లి ఎంపీ వంశీక్రిష్ణ అన్నారు. చెన్నూరు మండలం శివలింగపూర్ గ్రామంలో సత్వ ప్రకృతి వైద్య ఆసుపత్రి(Sattva Naturopathy Hospital)ని ఎంపీ వంశీ క్రిష్ణ ప్రారభించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో ప్రకృతివైద్య సేవలు అందించేందుకు యాజమాన్యం కృషి చేయడం హర్షానియమన్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప్రతి ఒక్కరు ప్రకృతి వైద్య సేవలు వినియోగించుకుంటే మనుగడ సాధించవ‌చ్చు అన్నారు. అనంతరం స్థానిక మధునపు పోచమ్మ(Madhunapu Pochamma) ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply