ప్రాణం తీస్త‌ది!

ప్రాణం తీస్త‌ది!

వ‌య్యారిభామ విష‌పు క‌లుపు మొక్క‌
ఇంచార్జి వ్యవసాయ అధికారి శివ గంగ ప్రసాద్.

అర్ధవీడు అక్టోబర్ 26(ఆంధ్రప్రభ) : వయ్యారిభామ.. వలపులు ఒలికించే దేహం కాదు. అటు పైర్లను, ఇటు మనుష్యుల ఆరోగ్యాలను హరించే ఒక విషపు కలుపు మొక్క. పొలాల్లోనే కాదు.. ఇప్పుడు ఇంటి ముంగిళ్ల‌లో సైతం ముక్కురాళ్ల‌ లాంటి తెల్లని పూతలతో ఆకర్షిస్తూ దర్శనమిస్తోంది. పొలాల్లో దీని పోకడ వనాలను తలపిస్తోంది. పంటను, మనుష్యులను నాశనం చేస్తోంది. అది ఎలానో ఆంధ్రప్రభకు వివరించారు స్థానిక ఇంచార్జి వ్యవసాయ అధికారి శివ గంగ ప్రసాద్. ఆ వివరాలు ఆయ‌న మాట‌ల్లోనే..

ఫ్యామిలీ: ఆస్ట్రేరేసియే
సైంటిఫిక్ నేమ్: పార్టీనియం హిస్టరోఫర్స్

తెలుగులో వయ్యారిభామ, కాంగ్రెస్ గడ్డి, నక్షత్ర గడ్డి, క్యారెట్ గడ్డి అని ప్రాంతాలను బట్టి అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ కలుపు జాతి మొక్క మనదేశానికి 1950 లో పూనే, న్యూఢిల్లీ రాష్ట్రాలలో ముందుగా గుర్తించారు. ఈ వయ్యారిభామ అనే కలుపు మొక్క పుష్పించే జాతి మొక్క. అత్యంత సులభంగా వ్యాపించి అతి త్వరగా ఏపుగా పెరుగుతుంది. ఈ మొక్క ఏపుగా పెరగడం వల్ల పంటల పెరుగుదల తగ్గి 35 నుంచి 40 శాతం వరకు దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. రసాయణిక ఎరువులను త్వరగా గ్రహించి ప్రధాన పంటకు పోటీగా మారి ఫైరు పెరుగుదలకు హాని కలిగిస్తుంది. వీటి పుప్పొడి ఇతర పంటలైన టమాటా, వంగ పంటల పుష్పాల మీద పడి వాటి దిగుబడి తగ్గడానికి కారణమవుతుంది. వయ్యారి భామ అని అందమైన పేరు గల ఈ గడ్డి జాతి మొక్క కొన్ని రకాల వైరస్ వ్యాప్తికి కారణం అవుతుంది. పంటకు హాని కలిగించే కొన్ని క్రిమి కీటకాలకు ఆశ్రయ మిచ్చి పంటలకు హాని కలిగిస్తుంది. దీనివలన మనుషులకు శ్వాస కోసం వ్యాధులు వ్యాపించుటకు కారణం అవుతుంది. పశువుల మేత కూడా పనికిరాదు.

దీనిని నివారించడానికి పంట పొలాలలో ఈ మొక్క కన్నా ఎక్కువ వేగంగా పెరిగే పంటలను సాగు చేసుకోవాలి. వీటిలో ముఖ్యమైనవి మొక్కజొన్న, బంతి జీడిగా వంటి పంటలు వున్నాయి. రసాయన మందులు విషయానికొస్తే పారాక్వాట్ 5 ml 1 లీటరు నీటికి కలిపి, ఒక ట్యాంకి పిరికెడు యూరియాను జత చేసి ఉదయం సమయంలో పిచికారీ చేస్తే ఈ మొక్క ఉధృతిని తగ్గించవచ్చు. అదేవిధంగా ఇండ్ల దగ్గర ఉన్నటువంటి ఈ వయ్యారి భామ మొక్కలను పూతదశకు రాకుండా ఉన్న ముందే తీసిపారేయాలి.

Leave a Reply