నంద్యాల మండలం కానాలలో విషాదం
- అడవిలో కొండను ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ మృతి
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లమల్ల అడవి ప్రాంతంలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్(Lorry driver) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే జాతీయ రహదారిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో పాత రైల్వే బోగద సమీపంలో లారీ కొండను ఢీ కొట్టింది.
ప్రమాదంలో నంద్యాల మండలం కానాలకు చెందిన డ్రైవర్ దూదేకుల బాల హుస్సేన్(Dudekula Bala Hussain) (50) అక్కడికక్కడే మృతిచెందారు. రోడ్డుకు ఇరుపక్కల ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నంద్యాల గిద్దలూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై కేసు(case) నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

