కుటుంబ క‌ల‌హాలే కార‌ణ‌మా?

కుటుంబ క‌ల‌హాలే కార‌ణ‌మా?

గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : మార్కండేయ కాలనీ(Markandeya Colony)లో చోటుచేసుకున్న కుటుంబ కలహం ఒక యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే .. గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన గంధం రాంకీ(Gandham Ranki) తండ్రి రమేష్ (29) గత రెండున్నర సంవత్సరాలుగా భార్యతో కలహాల నేపథ్యంలో వేరుగా ఉంటున్నాడు.

ఆ దుఃఖాన్ని తట్టుకోలేక రమేష్(Ramesh) అక్టోబర్ 20వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు తక్షణమే కరీంనగర్‌లోని కెల్విన్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్(Hyderabad) తరలిస్తుండగా ప్రజ్ఞాపూర్ సమీపంలో మార్గమధ్యంలోనే మృతి చెందాడు.

మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చురీ గదిలో ఉంచారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు గోదావరిఖని(Godavarikhani) 1టౌన్ ఎస్‌ఐ పి.రాజయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply