సూర్యాపేట, ఆంధ్రప్రభ : మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాల్లో నాగుల పంచమిని పురస్కరించుకొని మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఎరకేశ్వర నామేశ్వర స్వామి దేవాలయాల్లో పుట్టపై గుడ్లను ఉంచి ఆవుపాలు పోసి అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారిని పూలమాలలతో అలంకరించి నైవేద్యం సమర్పించారు. దేవాలయాల్లో అర్చకులు సంతోష్ శర్మ, సాయి శర్మ భక్తులకు పూజలు చేసి తీర్ద ప్రసాదాలు అందజేశారు.




