మూసాపేట్ లో భారీ అగ్నిప్రమాదం..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని మూసాపేటలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. గూడ్స్ షెడ్ రోడ్డులో ఉన్న ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆందోళన కలిగించాయి. గోదాములో నిల్వ ఉన్న రసాయన విభాగానికి మంటలు వ్యాపించడంతో భారీ అగ్నికీలలు ఎగసిపడ్డాయి.
క్షణాల్లోనే ప్రాంతమంతా దట్టమైన పొగ ముసురుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది (Police and firefighters) సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

