బస్సు దగ్ధం వెనుక నిజమేంటో…

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బైకును బస్సు ఢీకొన్న ఘటనలో.. చోటు చేసుకున్న పరిణామాలు సభ్య సమాజాన్ని కంగుతినిపిస్తున్నాయి. తెల్లవారుజామున 3.00 గంటల ప్రాంతంలో వర్షం పడుతోంది. బస్సు వేగంగా వెళ్తోంది. ఎదురుగా పల్సర్ బైక్ పై యువకుడు వెళ్తున్నాడు. బస్సు ఢీకొంది. అసలు ఈ దుర్ఘటన ఎలా జరిగింది. పల్సర్ బైక్.. బస్సు రెండూ వేగంగానే వెళ్తున్నాయి. అకస్మాత్తుగా బైక్ ను బస్సు ఢీకొనగానే డ్రైవరు .. యాక్సిడెంటును పట్టించుకోలేదు. పైగా హిట్ అండ్ రన్ రీతిలో బస్సు వేగం పెంచాడు. బస్సు తగిలి బైకర్ రోడ్డు పక్కన పడిపోయాడు. బైక్ పై బస్సు ఎక్కింది. బైక్ పెట్రోలు ట్యాంక్ పగిలింది.

300 మీటర్లు బైక్ ను బస్సు ఈడ్చుకుపోయింది. నిప్పు రగిలింది. బస్సు తగలబడింది. అంటే డ్రైవరు కనీస మానవత్వం లేకుండా.. కేసు నుంచి తప్పించుకునే ఆత్రుతలో బస్సును నడిపేశాడు. అంటే.. ప్రైవేటు బస్సుల డ్రైవర్లకు హిట్ అండ్ రన్ అలవాటే. ప్రమాదంలో గాయపడినోడు చచ్చినా పర్వాలేదు, తాను తప్పించుకోవాలి, ఇదీ ప్రైవేటు బస్సు డ్రైవర్లలో అంతర్లీన ఆలోచనగా ఈ ఘటన నిరూపిస్తోంది. ఇక మరో కోణం.. బైకర్ శివశంకర్ ఓ గ్రానైట్ కంపెనీలో పని చేస్తున్నాడు. గురువారం రాత్రి ఇంటిలో అలిగి తన స్నేహితుడి దగ్గరకు వెళ్లాడు. రాత్రి 9.00 గంటలక తల్లి ఫోన్ చేసింది. ఇదిగో వస్తున్నా.. అని చెప్పి తెల్లవారుజామున డోన్ కు బయలు దేరాడు. ఇతని మానసిక స్థితి కూడా అనేక అనుమానాలు రేపుతోంది. ఇలా అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తును షురూ చేనినట్టు సమాచారం.

Leave a Reply