ఐటం సాంగ్స్ చేసిన అందాల భామలు..
ఐటం సాంగ్స్ చేయాలంటే.. ప్రత్యేకించి హీరోయిన్స్ ఉండేవారు. వాళ్లను ఐటం క్వీన్స్ అనేవారు. అయితే.. ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టార్ హీరోయిన్స్ కూడా ఐటం సాంగ్స్ చేస్తున్నారు. దీంతో ఆ సినిమాకు మరింత క్రేజ్ పెరుగుతుంది. ఈ ప్లాన్ వర్కవుట్ అవ్వడంతో దర్శకనిర్మాతలు.. స్టార్ హీరోయిన్ తో ఐటం సాంగ్ చేయించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు స్టార్ హీరోయిన్ తో ఐటం సాంగ్ చేయించడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది..? ఇంత వరకు ఏ ఏ స్టార్ హీరోయిన్ ఐటం సాంగ్ చేసారు..?
స్టార్ హీరోయిన్ తో ఐటం సాంగ్ చేయించడం అనేది శ్రియతో స్టార్ట్ అయ్యిందని చెప్పచ్చు. అగ్రహీరోలందరితో నటించి ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడే దేవదాసు సినిమాలో శ్రియ ఐటం సాంగ్ చేసింది. ఆతర్వాత మున్నా, తులసి సినిమాల్లో కూడా ఐటం సాంగ్స్ చేసింది. ఆతర్వాత శ్రియ బాటలో మరికొంత మంది కథానాయికలు ఐటం సాంగ్స్ చేసారు. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా అయితే.. అల్లుడు శీను, జై లవకుశ సినిమాల్లో ఐటం సాంగ్ చేసింది. తాజాగా బాలీవుడ్ మూవీ స్త్రీ 2లో తమన్నా ఐటం సాంగ్స్ తో మరోసారి అదరగొట్టింది.
స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసి నేటికీ ఫుల్ ఫామ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ. బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో అదరగొట్టేసింది. ఆ పాత్రలో ఆమెను తప్పా ఇంకెవర్నీ ఊహించుకోలేం. అంతలా అద్భుతంగా నటించారామె. ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాలో చిన్నదమ్మే చీకులు కావాలా.. అంటూ సాగ్ ఐటం సాంగ్ లో ఎన్టీఆర్ తో కలిసి స్టెప్పులు వేసి వావ్ అనిపించింది రమ్యకృష్ణ.
అందం, అభినయం ఈ రెండు ఉన్న అతి కొద్ది మంది కథనాయికల్లో ఒకరు అనుష్క. నాగార్జున నటించిన సూపర్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన అనుష్క కెరీర్ ఆరంభంలోనే మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్ సినిమాలో ఐటం సాంగ్ చేయడం విశేషం. ఈ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. అయితే.. ఆతర్వాత అనుష్క ఐటం సాంగ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు.
ఇక సమంత అయితే.. పుష్ప సినిమాలో ఊ అంటావా మావ అంటూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది. దీంతో ఈ సాంగ్ యూబ్యూట్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్లింది. పుష్ప మూవీ సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందని చెప్పచ్చు. దీంతో పుష్ప 2 లో కూడా సమంతతోనే ఐటం సాంగ్స్ చేయిస్తారు అనుకున్నారు కానీ.. శ్రీలీలతో ఐటం సాంగ్ చేయించారు. కిస్ కిస్ కిస్ అంటూ సాగే ఈ పాట కూడా కుర్రోళ్ల మతులు పోగొట్టింది. దీంతో యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్లి సరికొత్త రికార్డులు సెట్ చేసింది. అసలు ఐటం సాంగ్ అంటే.. గుర్తొచ్చే డైరెక్టర్ సుకుమార్. ఆయన తన ప్రతి సినిమాలో ఖచ్చితంగా ఐటం సాంగ్ పెడతారు. ఆ సాంగ్ జనాలకు బాగా రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తారు. అది ఈ లెక్కల మాస్టర్ స్పెషాలిటీ.
చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా రంగస్థలం. ఈ సినిమాలో చరణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే.. ఈ మూవీలో జిల్ జిల్ జిల్ అంటూ సాగే ఐటం సాంగ్ ను పూజా హేగ్డేతో చేయించారు సుకుమార్. ఈ పాట రిలీజ్ తర్వాత నుంచి జిగేల్ రాణి అనేది ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. వీళ్లే కాకుండా కాజల్ అగర్వాల్, ప్రియమణి, హన్సిక, శృతి హాసన్ తదితరులు ఐటం సాంగ్స్ చేసి మెప్పించారు. మరి.. ఫ్యూచర్ లో ఇంకెంత మంది స్టార్ హీరోయిన్స్ ఐటం సాంగ్స్ చేస్తారో చూడాలి.

