కడలి కదలి 50 అడుగులు ముందుకు సముద్రం
(ఆంధ్రప్రభ, వాకాడు) : ఉమ్మడి నెల్లూరు జిల్లా (Nellore District) వాకాడు మండలం తుపిలి పాలెంలో 50 అడుగులు మేర సముద్రం ముందుకు వచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో అలలు ఎగసి పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను రెవెన్యూ (Revenue) అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
