మెగా జాబ్ మేళాకు ప్రత్యేక బస్సులు
మిర్యాలగూడ (ఆంధ్రప్రభ) తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాలు.. నీటిపారుదల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన హుజూర్ నగర్ లో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ జాబ్ మేళకు మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి తరలి వెళ్లే నిరుద్యోగ యువతీ యువకుల కోసం స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయిలో 240 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఈ మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఇబ్బందులు పడవద్దనే సదుద్దేశంతో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 25వ తేదీన జరిగే జాబ్ మేళాకు తరలి వెళ్లే నిరుద్యోగ యువతీ యువకులు ఎల్లుండి ఉదయం ఎనిమిది గంటల లోపు మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరారు. హుజూర్ నగర్ లో జాబ్ మేళాకు వెళ్లాలనుకునే వాళ్లు.. మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.