ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుంది

ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుంది

కాల్వ శ్రీరాంపూర్, అక్టోబర్ 23 : రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. గురువారం మండల కేంద్రంలో డిసిఎంఎస్ ద్వారా ఏర్పాటు చేసిన మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ సన్న వడ్లకు బోనస్ నిరంతర విద్యుత్ తో పాటు మధ్య దళారులను ఆశ్రయించి మోసపోకుండా ఉండేందుకు రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు.

టిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి నానా అవస్థలు పడేవారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి రైతులు ఏ పంట పండించినా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్, తాసిల్దార్ జగదీశ్వరరావు, మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply