అఖిల్ లెనిన్ పై భారీ అంచనాలు

అఖిల్ లెనిన్ పై భారీ అంచనాలు

అక్కినేని అఖిల్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సరైన బ్లాక్ బస్టర్ సాధించాలని తపిస్తున్నాడు. ఎంతగానో కష్టపడుతున్నాడు. అయితే.. ఆశించిన భారీ విజయం మాత్రం రావడం లేదు. ఏజెంట్ సినిమాతో అఖిల్ అనుకున్న హిట్ కొడతాడని అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ.. ఆ సినిమా ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఈసారి ఎలాగైనా సరే.. పెద్ద విజయం సాధించాలని లెనిన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇంతకీ.. ఈ మూవీ ఎంత వరకు వచ్చింది..? ఈ క్రేజీ మూవీ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు..?

అఖిల్ నటిస్తున్న లెనిన్ మూవీని మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నాడు. ఈ భారీ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో అఖిల్ కు జంటగా శ్రీలీల నటించాలి. అయితే.. ఈ కిసిక్ బ్యూటీ వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడం వలన లెనిన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో శ్రీలీల ప్లేస్ లో భాగ్యశ్రీ బోర్సే ను తీసుకున్నారు. గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ విభిన్న ప్రేమకథా చిత్రంలో డివోషనల్ టచ్ ఉండడం.. ప్రజెంట్ డివోషన్ మూవీస్ ట్రెండ్ నడుస్తుండడంతో లెనిన్ మూవీ పై పాజిటివ్ టాక్ ఉంది.

ఈ సినిమా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఇంత వరకు ఎలాంటి అప్ డేట్ మేకర్స్ నుంచి రాలేదు. తాజా సమాచారం ప్రకారం.. లెనిన్ ప్రస్తుతం క్లైమాక్స్ కు చేరుకుందని.. త్వరలో క్లైమాక్స్ షూట్ చేయనున్నారని తెలిసింది. దీనికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆమధ్య రిలీజ్ చేసిన లెనిన్ గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ను అఫిషియల్ గా ఇవ్వనున్నారని సమాచారం. ఇక ఈ క్రేజీ మూవీని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. లెనిన్ మూవీతో అఖిల్ ఆశించిన బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.

Leave a Reply