సకాలంలో గాయపడిన ఎద్దుకు వైద్యం

సకాలంలో గాయపడిన ఎద్దుకు వైద్యం

  • శ్రీ సత్యసాయి జిల్లాలో మానవత్వం

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : పశువులను సకల దేవతా స్వరూపంగా భావించి పూజించడం సహజం. కొంతమంది భక్తులు పశువులను ప్రసిద్ధ దేవాలయాలకు విరాళంగా ఇవ్వడం జరుగుతోంది. ఇందులో భాగంగా కదిరి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ప్రహ్లాద సమేత శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి(Sri Mat Qadri Lakshmi Narasimha Swamy) వారికి భక్తులు ఇచ్చిన పశువుల విషయంలో అటు ఆలయ అధికారులు ఇటు ప్రభుత్వ అధికారులు వాటి సంరక్షణలో పూర్తి నిర్లక్ష్యం వహించడం జరుగుతుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ కారణంగా గోవులు,పశువులు నిత్యం కదిరి పట్టణంలో ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలకు బారినపడి గాయాలపాలు అవ్వడం జరుగుతోంది. ఒక్కొక్క సందర్భంలో ప్రాణాలను సైతం కోల్పోతున్నాయి. ఆ మూగ జీవాల ఆక్రందన , ఆవేదన మనకు అర్థం కావడం లేదా? సోమవారం కదిరి బైపాస్(Kadiri Bypass) రోడ్డులో ఒక ఎద్దును గుర్తు తెలియని వాహనం గుద్దేసి వెళ్ళిపోవడం జరిగింది. ప్రమాదం వల్ల గాయాలపాలై తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న పశువు సంగతి స్థానిక యువకులు తెలిపిన వెంటనే కదిరి ప్రభుత్వ పశు వైద్య సిబ్బంది లక్ష్మీ కాంత్ రెడ్డి(Lakshmi Kant Reddy)కి ఫోన్ ద్వారా తెలిపి, వెంటనే స్పందించి స్థానికుల, యువకుల సహకారంతో ఆ ఎద్దుకు వైద్యం అందించడం జరిగింది.

సకాలంలో వైద్యం అందరం ద్వారా ఎద్దు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. కాగా దయచేసి వాహన దారులను మేము వేడుకొనేది ఒక్కటే,ప్రయాణాలు చేస్తున్న సమయంలో నిర్లక్ష్యం వహించకుండా వాహనాలను జాగ్రత్తగా ముందు చూపుతో నడిపి మూగ జీవాలను గాయపరచకుండా ప్రయాణాలు చేస్తారని ఆశిస్తున్నాము. ఇదే సందర్భంలో ఆలయ అధికారులు అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి పశువులకు సంబంధించిన గోశాలను కదిరి పట్టణ సమీపంలోనే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా కదిరి పట్టణంలో గోవుకు గాయం అయ్యింది అని తెలిపిన వెంటనే 24 గంటలు స్పందిస్తూ మాకు అందుబాటులో ఉంటూ గోవులకు వైద్యం అందించడంలో సహకరిస్తున్న లక్ష్మీ కాంత్ రెడ్డికి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

Leave a Reply