దీపావళికి ‘బెటాలియన్’ అప్‌డేట్!

పాన్-ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్, ‘సీతా రామం’ ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి కలయికలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం #PrabhasHanu అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జ‌రుపుకుంటుంది. కాగా, దీపావళి పండుగ (అక్టోబర్ 20) సందర్భంలో ఫ్యాన్స్ కోసం సినిమా మేకర్స్ ప్రత్యేక ఫెస్టివల్ బోనస్ ప్రకటించారు. రేపు కీలక అప్‌డేట్ అందించనున్నట్టు ప్ర‌క‌టించారు.

ఈ అప్‌డేట్‌ను రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక‌, అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఈ ప్రకటన మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

యుద్ధం కోరే ‘బటాలియన్’.. సినిమా కథాంశంపై హింట్!

ఈ అప్‌డేట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ “This 🔥 Battle 🔥 demands 🔥 a 🔥 BATTALION!” (ఈ యుద్ధానికి ఒక బెటాలియన్ కావాలి!) అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో టీజ్ చేశారు. ఈ ట్యాగ్‌లైన్ సినిమాకు ఉన్న గ్రాండ్ ఎఫెక్ట్, కథలోని ఉత్కంఠభరిత ఘట్టాల తీవ్రతను చూపిస్తుంది.

ఇక‌, ఈ చిత్రం కథాంశం 1940ల కాలం నాటి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ నేప‌థ్యంలో.. పీరియడ్ వార్-డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. అనధికారికంగా ‘ఫౌజీ’ అని పిలవబడుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 60% పూర్తయినట్లు సమాచారం.

ప్రభాస్ పుట్టినరోజుకు ముందు దీపావళి కానుకగా వస్తున్న ఈ అప్‌డేట్, సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదలయ్యేది మోషన్ పోస్టర్ లేదా ప్రీ-టీజర్ రివీల్‌గా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రకటన సినిమా ప్రచార పర్వానికి అధికారికంగా శ్రీకారం చుట్టనుంది.

రీ-రిలీజ్ ల‌ సందడి

ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా భారీగా రీ-రిలీజ్ షోస్ ప్లాన్ చేశారు. తెలుగు సినిమా స్థాయిన అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిని బాహుబలి 1,2 సిరీస్ ని ఒకే పార్ట్‌గా ఈ నెల చివర్లో థియేటర్లలో విడుదల చేయనున్నారు. దాంతోపాటు, 2023లో రిలీజ్ అయిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్’ ను కూడా ప్రపంచవ్యాప్తంగా మరల థియేటర్స్‌లో చూపించనున్నారు. ఈ షోస్ కోసం అడ్వాన్స్ బుకింగ్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి.

ఇక‌ హైదరాబాద్, బెంగళూరుతో పాటు పలు అంతర్జాతీయ నగరాల్లోని ఫ్యాన్ క్లబ్‌లు ఇప్పటికే ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా ప్రభాస్ నటించిన ఈశ్వర్, పౌర్ణమి, రెబెల్, ఆదిపురుష్, మిస్టర్ పర్ఫెక్ట్, సాహో వంటి హిట్ సినిమాలను స్పెషల్ షోలలో ప్రదర్శించ‌నున్న‌రు.

Leave a Reply