ఉప రాష్ట్రపతి నివాసానికి బాంబు బెదిరింపు
ఢిల్లీ : దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు (Bomb threats) ఆందోళన రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలకు వరుసగా బెదిరింపు సందేశాలు వస్తున్నాయి. దీంతో భద్రతా సంస్థలు హై అలర్ట్‌లోకి వెళ్లాయి.
తాజాగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) నివాసానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. ఆయన నివాసానికి బాంబు బెదిరింపు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే భద్రతా సిబ్బంది సోదాలు నిర్వహించారు. అధికారులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి విచారణ ప్రారంభించారు.