హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TG BIE) 2025-2026 ఇంటర్ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్‌ను రూపొందించింది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 2025లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
బోర్డు రెండు వేర్వేరు తాత్కాలిక టైమ్‌టేబుల్‌లను ప్రతిపాదించింది. వీటి ప్రకారం పరీక్షలు ఫిబ్రవరి 23 లేదా ఫిబ్రవరి 25 నుంచి మొదలయ్యే సూచనలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు..
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే తాత్కాలిక టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. ఆ రాష్ట్రంలో పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరగనున్నాయి. తెలంగాణ కూడా దాదాపుగా ఇదే సమయంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
తొమ్మిది లక్షల మందికి పైగా…
ఈ ఏడాది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షలకు సుమారు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు.
రెండు షెడ్యూల్లు సిద్ధంగా ఉన్నప్పటికీ, పరీక్షా ఫీజు నోటిఫికేషన్, తుది టైమ్‌టేబుల్‌ను ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాతే అధికారికంగా విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.