ఇతర ప్రాంతాల వారు టెండర్లు వేయొద్దు
ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : మునుగోడు(Previously) నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు టెండర్లు వేసే వ్యాపారులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు సూచనలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం(State Govt) తీసుకొచ్చిన మద్యం పాలసీతో మునుగోడు నియోజకవర్గానికి సంబంధం లేదని అన్నారు.
మద్యం షాప్(Ikkur Shop) టెండర్లలో మద్యం దుకాణాల కోసం నియోజకవర్గానికి చెందిన స్థానికులే టెండర్లు వేయాలని, ఇతరులు వేస్తే సహించబోమని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. సాయంత్రం 4:00 నుండి రాత్రి 8 గంటల వరకు దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరపాలని, పర్మిట్ రూముల(permit rooms)కు అనుమతించేది లేదని, శివారు ప్రాంతాలలోనే మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని, గ్రామాలలో బెల్ట్ షాపులు(belt shops) నిర్వహించరాదని ఆయన సూచించారు.
నియోజకవర్గ ప్రజలకు భద్రత, మహిళలకు రక్షణ కల్పించడం తన లక్ష్యమని, ఇందుకోసం తాను ఎంత దాకా అయినా పోరాడుతానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) చెప్పారు.