వీటి సేవలు మధుర జ్ఞాపకం మాత్రమే!
మక్తల్, ఆంధ్రప్రభ : సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత వాటికి విలువ తగ్గింది. అలానే రెండు నెలల కిందట వాటి సేవలు నిలిపి వేయడంతో కనుమరుగైంది. ప్రస్తుతం ఒక తరానికి ఇవి మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. నేటి తరానికి ఓ యూట్యూబ్, వెబ్(YouTube, web)లో కనిపించే బొమ్మగా మిగిలింది. అవే తపాల బాక్సు! లేఖలు, పార్శిళ్లు(letters, parcels) ఒక ప్రాంతం నుంచి మరొ ప్రాంతానికి చేరవేయాలనే తపాలా వ్యవస్థ ఏర్పాటు ఈ రోజు ప్రపంచ తపాలా దినోత్సవం.
భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో 1764-1766 మధ్య ముంబై, చెన్నై, కోల్‌కతాలో మొట్టమొదటి పోస్టాఫీసులు ప్రారంభమయ్యాయి. క్రమంగా పోస్టుబాక్సులు(postboxes) అనేవి లేఖలు వేయడానికి, అందుకున్న లేఖలను తీసుకుని, ఇతరులకు పంపించడానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన సాధనంగా మారాయి. సెల్ ఫోన్ విస్తృతి, వాట్సాప్(WhatsApp) తదితర సాంకేతిక రోజుల్లో ఒకరి క్షేమసమాచారం మరొకరు తెలుసుకునేందుకు తపాల వ్యవస్థ ఓ పెద్దదిక్కుగా ఉండేది.
ఉత్తరాలు రాసి పోస్ట్ బాక్స్ లో వేస్తే చేరాల్సిన చోటికి తపాలా శాఖ(postal department) చేరవేసేది. తిరిగి అక్కడి నుండి ప్రత్యుత్తరం వచ్చేది .ఇలా ఒకరినొకరి యోగక్షేమాలు తెలుసుకునేవారు. ప్రత్యుత్తరం కాస్త ఆలస్యమైనా నా ఉత్తరం అక్కడికి చేరిందో లేదో ఎందుకో నాకు తిరిగి ఉత్తరం రాలేదు అని ఆందోళన చెందడం, ఆలోచించడం అప్పట్లో సర్వసాధారణం. ఎందరో ప్రేమికులను కలిపే ఒక వేదికగా కూడా ఉత్తరాలు ఉండేవి. కానీ నేడు ఆ ఉత్తరాలు పోస్ట్ బాక్స్ కనిపించడం లేదు.
సాంకేతికత పెరిగిన తర్వాత ఉత్తరాలు రాసుకునే పద్ధతి మానుకున్నారు. సెల్ ఫోన్(cell phone) వచ్చిన తర్వాత ఉత్తరాలు రాసుకునే వారి సంఖ్య తగ్గింది. వాట్సాప్ వచ్చిన తర్వాత పూర్తిగా ఉత్తరాల వైపు చూడటం మానేశారు నేటి తరం. దీంతో పోస్టు బాక్సు వినియోగం కనుమరుగైంది!