ఐరాస సమావేశాలకు ఎంపీ వంశీకృష్ణ
- సామాజిక న్యాయంపై ప్రసంగం
పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 7(ఆంధ్రప్రభ): ఐక్యరాజ్య సమితి(ఐరాస) సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యేందుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ (Gaddam Vamsi Krishna) మంగళవారం బయలుదేరారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశంలో దేశ అభివృద్ధి, సమానత్వం, సామాజిక న్యాయం వంటి ప్రధాన అంశాలపై చర్చించనున్నారు.
ఇప్పటివరకు భారతదేశం తరుపున చాలా తక్కువ మంది పార్లమెంట్ సభ్యులు మాత్రమే ఈ సమావేశాలకు హాజరయ్యారని, అలాంటి గౌరవప్రదమైన వేదికపై తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం పెద్దపల్లి (Peddapally) ప్రజలకు గర్వకారణమని ఎంపీ కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు.
ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులతో వంశీకృష్ణ పరస్పర చర్చలు జరపనున్నారని తెలిపారు. ప్రపంచ స్థాయి అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక సమానత్వం, విద్యా, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలపై భారత దృక్కోణాన్ని ఆయన ప్రస్తావించనున్నారని వెల్లడించారు.