కృష్ణలంక పీఎస్‌లో వల్లభనేని వంశీ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు వంశీని పోలీసులు విచారించారు. వంశీ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెడికల్ సర్టిఫికెట్ తో కోర్టులో హాజరుపరచనున్నారు.
కాగా, సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపు, దాడి కేసులో వల్లభనేని వంశీపై పోలీసు కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ సోదరుడు కిరణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు వంశీపై కిడ్నాప్, అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసులో వంశీని ఏ1గా పరిగణించిన పోలీసులు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఏ7 ఎలినేని వెంకట శివరామకృష్ణ, ఏ8 నిమ్మ లక్ష్మీపతిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిని కూడా వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం మెడికల్ సర్టిఫికెట్‌తో కోర్టులో హాజరుపరచనున్నారు.