తొలి సారి క‌త్తులు దూస్తున్న దాయాదులు..

  • ఆసియా కప్ తుది పోరు

క్రికెట్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 41 ఏళ్ల తర్వాత, భారత క్రికెట్ జట్టు, పాకిస్థాన్ జట్టు ఆసియా కప్ ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ చారిత్రక మహా సమరం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. కాగా, ఈ తుది పోరులో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాక్ మొద‌ట బ్యాటింగ్ చేప‌ట్ట‌నుంది.

తుది జ‌ట్లు :

భారత్: అబిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్), తిలక్ వర్మ, సంజు సమ్సన్ (wk), శివమ్ దూబే, అక్సర్ పటేల్, రింకు సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా

పాకిస్తాన్: సహిబ్‌జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా (కెప్), హుస్సేన్ తలాట్, మొహమ్మద్ హారిస్ (wk), మొహమ్మద్ నవాజ్, ఫాహీం అష్రఫ్, అబ్రార్ అహ్మద్, షాహీన్ ఆఫ్రిది, హారిస్ రౌఫ్

ఇక ఈ టోర్నమెంట్‌లో భారత్ అజేయంగా ముందుకు సాగింది. అక్క‌డ‌క్క‌డ త‌డ‌బ‌డినా.. ఆత్మవిశ్వాసం, సమన్వయంతో సునాయాసంగా ఫైనల్‌కు చేరుకుంది. మ‌రోవైపు పాకిస్తాన్ ప్రయాణం మాత్రం రోలర్ కోస్టర్ రైడ్ ను తలపించింది. లీగ్ దశలో తడబడినప్పటికీ, కీలక సమయాల్లో అద్భుతంగా పుంజుకుని, టైటిల్ పోరుకు చేరింది.

భారత్ ఆధిపత్యం..

కాగా, ఈ ఆసియా కప్‌లో ఇరు జట్లు తలపడటం ఇది మూడోసారి. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌లలో భారత్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి, బ్యాటింగ్ & బౌలింగ్‌లో పైచేయి సాధించి పాకిస్తాన్‌ను మ‌ట్టిక‌రిపించింది. అయితే, భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లలో గత రికార్డులు పెద్దగా ప్రభావం చూపవు. ఒత్తిడి, భావోద్వేగాలు, జాతీయ గౌరవం… వంటి అంశాలు ఈ పోటీరి సాధారణ ఆటలకంటే ఎక్కువ స్థాయికి తీసుకెళ్తాయి. దీంతో నేడు జ‌ర‌గ‌నున్న టైటిల్ పోరు మ‌రింత ఉత్కంఠంగా మారింది.

Leave a Reply