ఇమేజింగ్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా నిలిచిన OM సిస్టమ్ (Olympus 85 ఏళ్ల వారసత్వం మీద నిర్మించబడిన బ్రాండ్) భారత మార్కెట్‌లో రెండు కొత్త ప్రీమియం ఉత్పత్తులను ఆవిష్కరించింది. వీటిలో OM-5 Mark II ఇంటర్‌ఛేంజబుల్ లెన్స్ కెమెరా & M.ZUIKO DIGITAL ED 50-200mm F2.8 IS PRO లెన్స్ ఉన్నాయి. వన్యప్రాణులు, మాక్రో, పక్షుల ఫోటోగ్రఫీ, ల్యాండ్‌స్కేప్, ట్రావెల్, స్ట్రీట్ & అర్బన్ ఫోటోగ్రఫీ కోసం ఇవి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.

భారత మార్కెట్ ప్రాధాన్యం

ఈ ఆవిష్కరణ OM సిస్టమ్‌కి ఒక ముఖ్యమైన మైలురాయి. భారతదేశాన్ని ఆసియా పసిఫిక్ ప్రాంతానికి వ్యూహాత్మక వృద్ధి కేంద్రంగా పరిగణిస్తూ, అవుట్‌డోర్ ఫోటోగ్రఫీ ఔత్సాహికులకు మరిన్ని అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ఉత్పత్తులను తీసుకువచ్చింది. దీని ద్వారా డీలర్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసి, భారత్ గ్లోబల్ మార్కెట్‌లో కీలక పాత్ర పోషించేలా చేయాలని కంపెనీ సంకల్పించింది.

OM-5 Mark II ప్రత్యేకతలు

భారత పండుగ సీజన్‌కి సరిగ్గా సరిపోయే సమయంలో విడుదలైన ఈ కెమెరా కాంపాక్ట్ & తేలికైన డిజైన్‌లో లభిస్తుంది. స్ప్లాష్, డస్ట్, ఫ్రీజ్‌ప్రూఫ్ ప్రొటెక్షన్ (IPX53, -10°C వరకు)తో రూపొందించబడింది. క్లాస్-లీడింగ్ 5-యాక్సిస్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కలిగి ఉంది. మెరుగైన ఎర్గోనామిక్స్ కోసం కొత్తగా రూపకల్పన చేసిన గ్రిప్. అవుట్‌డోర్ ఫోటోగ్రాఫర్ల అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ అప్‌గ్రేడ్‌లు చేయబడ్డాయి.

M.ZUIKO DIGITAL ED 50-200mm F2.8 IS PRO లెన్స్

ఈ కొత్త లెన్స్ టెలిఫోటో జూమ్ రేంజ్‌లో ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది. స్థిరమైన F2.8 ఎపర్చర్. విస్తృత 100–400mm ఫోకల్ రేంజ్ (35mm సమానం). 5-యాక్సిస్ సింక్ IS అనుకూలత, 7 స్టెప్స్ వరకు స్టెబిలైజేషన్. తీవ్రమైన ఫోకల్ లెంగ్త్‌లలో కూడా హ్యాండ్‌హెల్డ్ షూటింగ్‌కి అనువుగా ఇంజనీర్ చేయబడింది. ఇలా, ఈ రెండు ప్రీమియం ప్రోడక్ట్స్‌తో OM సిస్టమ్ భారత మార్కెట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసింది.

భారత మార్కెట్‌పై OM సిస్టమ్ దృష్టి

OM డిజిటల్ సొల్యూషన్స్ కార్పొరేషన్ CEO షిగెమి సుగిమోటో మాట్లాడుతూ.. “భారతదేశం కోసం మా విజన్ ఒక బలమైన, శాశ్వతమైన ఎకోసిస్టమ్‌ను నిర్మించడం. దీని ద్వారా ఫోటోగ్రాఫర్లకు ఆధునిక టెక్నాలజీని అందించి, వారి సృజనాత్మకతను పెంచుతూ, మా డీలర్, ఛానెల్ భాగస్వామ్యాలను బలోపేతం చేస్తాం. భారతదేశంలో అపారమైన సామర్థ్యం ఉంది, ఈ ఆవిష్కరణలు భవిష్యత్తులో మేము చేయబోయే పెట్టుబడులు, ఆవిష్కరణలు, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌లకు ఒక ముందడుగు. భారతదేశం కేవలం వృద్ధి మార్కెట్ మాత్రమే కాదు, మా గ్లోబల్ రోడ్‌మ్యాప్‌లో ఒక వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన దేశం.” అని అన్నారు.

“OM-5 Mark II & కొత్త PRO లాంగ్ జూమ్ లెన్స్ ఆవిష్కరణ భారతదేశంలో OM సిస్టమ్‌కు ఒక మైలురాయి. ఇవి అవుట్‌డోర్ ఇమేజింగ్‌లో మా నాయకత్వాన్ని బలపరుస్తూ, వేగంగా ఎదుగుతున్న మిర్రర్‌లెస్ కెమెరా విభాగంలో కొత్త అవకాశాలను తెరుస్తాయి. ఈ ప్రోడక్ట్స్ భారతీయ ఫోటోగ్రాఫర్లలో సృజనాత్మకతకు, కొత్త ఆవిష్కరణలకు ప్రేరణనిస్తాయి,” అని OM సిస్టమ్ వైస్ ప్రెసిడెంట్ & హెడ్ ఆఫ్ APAC/మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ హండూ అన్నారు.

APAC ఫోటోగ్రఫీ పోటీ !!

ఫోటోగ్రఫీ సంస్కృతిని ప్రోత్సహించడానికి, OM సిస్టమ్ తన వార్షిక APAC ఫోటోగ్రఫీ పోటీని ప్రకటించింది. వినియోగదారులు తమ ప్రతిభను ప్రపంచ వేదికపై ప్రదర్శించే అవకాశం కలిగే ఈ పోటీ ప్రతి సంవత్సరం అక్టోబర్ నుండి జనవరి వరకు జరుగుతుంది. ఫలితాలు మార్చిలో ప్రకటించబడతాయి.

ధరలు & లాంచ్ ఆఫర్లు

OM-5 Mark II (14-150mm తో) : రూ. 1,39,990
(ప్రత్యేక పండుగ ఆఫర్‌గా రూ. 14,990 విలువైన 10×50 బైనాక్యులర్స్ ఫ్రీ) సెప్టెంబర్ 18, 2025 నుండి అందుబాటులో.

M.ZUIKO DIGITAL ED 50-200mm F2.8 IS PRO లెన్స్ : రూ. 3,29,990
– అక్టోబర్ 1, 2025 నుండి ఆర్డర్ ప్రాతిపదికన లభ్యం.

ఒలింపస్ తర్వాత కొత్త అధ్యాయం

ఈ ఆవిష్కరణలతో, OM సిస్టమ్ ఒలింపస్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లి, భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అవుట్‌డోర్ క్రియేటర్లు, అన్వేషకులు కోసం కెమెరాలను కొత్తగా రూపకల్పన చేస్తోంది.

Leave a Reply