- కర్నూలులో విజిబుల్ పోలిసింగ్
- భద్రతపై ప్రజలకు భరోసా
ఆంధ్రప్రభ, కర్నూలు బ్యూరో : విజిబుల్ పోలీసింగ్ తో భద్రతపై ప్రజల్లో భరోసా పెంచాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తన సిబ్బందని ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా రాత్రి వేళల్లో ప్రజల భద్రత , రక్షణలో అన్ని ముఖ్య కూడళ్లు, జనం రద్దీగా ఉండే ప్రదేశాలు రహదారులపై సంచరిస్తూ పోలీసు పెట్రోలింగ్ చేస్తూ గస్తీ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఎటువంటి నేరాలు జరగకుండా ఏటీఎం కేంద్రాల వద్ద రాత్రి గస్తీని పటిష్ట చేశారు. పాత నేరస్థులు, పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న నేరగాళ్లు ఉంటే అరెస్టు చేసేలా మొబైల్ సెక్యూరిటీ డివైజ్లతో వేలిముద్రలను సేకరిస్తున్నారు. పాత నేరస్థుల జాబితాతో పోల్చి చూస్తున్నారు.
ద్విచక్రవాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవింగులకు దూరంగా ఉండాలన్నారు. నేరాల కట్టడిపై నిఘా, రోడ్డు సేఫ్టీ నియమాలపై ప్రజల్లో అవగాహన, తదితర చర్యలు చేపట్టారు.

