పోటీ చేస్తారు.. గెలుస్తారు
- అసెంబ్లీకి మాత్రం పోరు
- వైఎస్ జగన్..కేసీఆర్ ను ఉతికి ఆరేసిన ..
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
పల్నాడు రూరల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM YS Jagan Mohan Reddy), తెలంగాణ మాజీ సీఎం కే. చంద్రశేఖర రావు(CM K. Chandrasekhara Rao)ను ప్రజలు గెలిపించారని, వాళ్లకి ప్రతిపక్ష హోదా లేదన్నసాకుతో అసెంబ్లీకి వెళ్లక పోవడం అంటే.. పెళ్లి చేసుకుంటాను గాని కాపురానికి పోను అన్నసామెతగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఎద్దేవా చేశారు.
సత్తెనపల్లికి ఒక ప్రైవేట్(Private) కార్యక్రమానికి వచ్చిన నారాయణ ఈ విధంగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి పోకపోతే తమకు ఓటు(vote) వేసి గెలిపించిన ప్రజలను మోసం చేసినట్టేనన్నారు. అసెంబ్లీకి(assembly) పోరుగాని ప్రభుత్వ పరంగా వచ్చే లబ్ధిని మాత్రం పొందుతున్నారని, ఇప్పటికైనా అసెంబ్లీకి వెళ్లి ప్రజల తరఫున మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా(opposition status) కావాలంటే ఒక లెక్క ఉంటుందని, దాని ప్రకారమే హోదా ఇస్తారన్నారు. ఆయన వెంట సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు(Muppalla Nageswara Rao), రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, గుంటూరు జిల్లా కార్యదర్శి కె.మాలాద్రి, సత్తెనపల్లి పట్టణ కార్యదర్శి వల్లెం లక్ష్మీ చెన్నకేశవరావు ఉన్నారు.

