వ‌ర‌ద ప్రాంతాల ప‌రిశీల‌న‌

నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు(Crops) దెబ్బతిన్న ప్రతి రైతుకు నష్టపరిహారం ప్ర‌భుత్వం అందిస్తుంద‌ని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్(Chairman, State Finance Commission) సిరిసిల్ల రాజయ్య తెలిపారు. ఈ రోజు సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో తెగిపోయిన పెద్ద చెరువు కట్టను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(Abhilash Abhinav)తో కలిసి ఆయ‌న ప‌రిశీలించారు. రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

రైతుల బాధలు విన్నఅనంతరం చైర్మన్(Chairman) మాట్లాడుతూ, ఏ ఒక్క రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పంట నష్టానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని రాజ‌య్య తెలిపారు. అదేవిధంగా వరద ప్రవాహానికి(Varada Pharao) దెబ్బతిన్నరహదారులను కూడా మరమ్మతు చేస్తామని హామీ ఇచ్చారు.

రైతులు నష్టపోయిన(Damaged) సుమారు 300 ఎకరాల పంటకు సంబంధించిన నివేదికను(Report) వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్(Collector Kishore Kumar), రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply