మంత్రి సీతక్క మేడారం జాతర ప్రాంతాన్ని, ముఖ్యంగా రోడ్లను పరిశీలించారు. ప్రోటోకాల్ పక్కనపెట్టి ములుగు ఎస్పీ శబరీష్ బైక్ పై తిరుగుతూ రోడ్ల పరిస్థితిని పరిశీలించారు మంత్రి సీతక్క.
రాబోయే మహా జాతరకు ఏర్పాట్లను సమీక్షిస్తూ, జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకని ట్రాఫిక్ జామ్‌లు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించమని అధికారులుకు సూచించారు. అలాగే, అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక మార్గాలను పోలీసులకు గుర్తించమని, VIP రాకపోకల వల్ల భక్తులకు ఇబ్బందులు తలెత్తకూడదని కూడా ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు.
వాహనాల సజావుగా రవాణా, పార్కింగ్ సౌకర్యాలు, అత్యవసర సేవలకు అడ్డంకి రాకుండా వంతెనల పర్యవేక్షణ వంటి అంశాలపై విభాగాల మధ్య సమన్వయంతో ఏర్పాట్లు చేయమని ప్రత్యేకంగా తెలిపారు.

