ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: భూపాలపల్లి(Bhupalpalli) మండలం గొల్లబుద్ధారం ఎస్టీ హాస్టల్ లో శనివారం హాస్టల్ వార్డెన్(Warden) నిర్లక్ష్యంతో ఇద్దరు విద్యార్థులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. హాస్టల్లో వార్డెన్ విద్యార్థులను చెట్టు ఎక్కి కొమ్మలు కొట్టాలని చెప్పగా వారు కొమ్మలు కొడుతుండగా ఇద్దరి విద్యార్థులు విద్యుత్ షాక్(electric shock)కు గురయ్యారు. ఈ ప్రమాదంలో 9వ తరగతి చదువుతున్న రాజేందర్(Rajender) అనే విద్యార్థికి గాయమైంది. కాగా బాలుడిని జిల్లా కేంద్రంలోని ప్రధాన అస్పత్రికి (వంద పడకలు) ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలపాలైన మరో విద్యార్థిని హాస్టల్లోనే ఉంచారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

వార్డెన్ విద్యార్థులతో ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయించడం పట్ల తల్లిదండ్రులు(parents), విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నత అధికారులు స్పందించి వార్డెన్ ఫై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply